|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:28 PM
జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా ప్రమాదవశాత్తు సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన ఘటనలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేతలు పేర్ని నాని, విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే వీరి తరఫున న్యాయవాది ఎల్లారెడ్డి వాదిస్తూ.. కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులపైనా కేసు నమోదు చేశారని, ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యుడవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్నవారు కాదన్నారు. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు స్పష్టం చేశారు.
Latest News