|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:27 PM
సీఎంగా ఉండగా తాను ఏనాడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పర్యటనలపై ఆంక్షలు విధించానా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తన పర్యటనలకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వకపోగా ఆంక్షలు విధించడం ఏమిటన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ కిందపడి సింగయ్య అనే కార్యకర్త మృతిచెందిన ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ‘‘నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామం వెళ్లి వస్తుండగా దురదృష్టకర ఘటన జరిగింది. ఈ విషయం మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే నేను స్పందించాను. ఆ కుటుంబాన్ని కలుసుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించాను. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇలాగే స్పందిం చాం. అయినా మామీద విషప్రచారం చేస్తున్నారు. మానవత్వం..నైతికత గురించి చంద్రబాబు, పవన్‌లు మాట్లాడటం ఏమిటి? వారు నాకు పాఠా లు చెప్పడం ఏమిటి’’ అని జగన్ ప్రశ్నించారు.
Latest News