|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:18 PM
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చట్ట్యారి-చింగస్ సమీపంలో టెంపో ట్రావెలర్ ఒక మినీ గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. టెంపో పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News