|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 11:30 AM
ఏపీ మంత్రివర్గం మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. వైజాగ్ లో కాగ్నిజెంట్ఏర్పాటుకు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు రూ. 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్‌ను నేషనల్ హైవే - 16కు కలిపేందుకు రూ. 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అమోదం తెలపనుంది.
Latest News