|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 11:48 AM
AP: అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన శివానందకు కూడేరు ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల శివానంద భార్య మృతి చెందింది. తన కూతురును శివానందే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదవడంతో శివానంద జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శివానందను తలపై బండరాయితో కొట్టి చంపారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Latest News