|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 01:25 PM
రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైయస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ..వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైయస్ఆర్‌సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు.
Latest News