|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 01:36 PM
ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకు అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని ఆయన తెలిపారు. అయితే, లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు తమ సైనిక చర్యలను ఆపేది లేదని స్పష్టం చేశారు.ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నెతన్యాహు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రానికి అమెరికా దాడుల వల్ల చాలా తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ముప్పును తొలగిస్తున్నామని, వారిని వెనక్కి పంపిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు."లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా మా చర్యలను కొనసాగించము. అలాగని చాలా త్వరగా ముగించము కూడా. లక్ష్యాలు నెరవేరినప్పుడు, ఆపరేషన్ పూర్తవుతుంది. పోరాటం ఆగిపోతుంది" అని నెతన్యాహు స్పష్టం చేశారు. సుదీర్ఘ పోరులోకి ఇజ్రాయెల్‌ను లాగడానికి తాము సిద్ధంగా లేమని విలేకరులతో ఆయన అన్నారు. "ఇజ్రాయెల్ ను పూర్తిగా తుడిచిపెట్టాలనేదే ఇరాన్ పాలకుల ఉద్దేశం. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మా ఉనికికి ఉన్న రెండు ప్రధాన ముప్పులను (అణు ముప్పు, బాలిస్టిక్ క్షిపణి ముప్పు) తొలగించడానికి ఈ ఆపరేషన్ చేపట్టాం. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నాం. వాటిని పూర్తి చేయడానికి మేం చాలా, చాలా దగ్గరలో ఉన్నాం" అని నెతన్యాహు వివరించారు.
Latest News