|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 01:18 PM
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైయస్ఆర్‌సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైయస్ఆర్‌సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలకు వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు.
Latest News