|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:07 PM
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.2గా నమోదైంది. దీంతో సెమ్నాన్ ప్రాంతంలో భూమి కంపించింది. టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఈరోజుకు తొమ్మిది రోజులు. రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా తో సహా అన్ని ప్రపంచ దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన జీ7 దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించాయి. మరోవైపు ఇరాన్ వైపు 21 ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి. అదీకాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది.
Latest News