|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 03:03 PM
గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఆరవిల్లి జిల్లా నీట మునిగింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో శని, ఆదివారాలు ఆరవిల్లికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఛాన్స్ ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Latest News