|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:06 AM
AP: విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నెరవేరుస్తున్నారని, ఆయనకు గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల వల్లే యోగాంధ్ర విజయవంతం అయిందని, ఆశించిన దాని కంటే ఎక్కువ మంది ప్రజలు యోగాంధ్రకు వచ్చారన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వల్లే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయం అని చెప్పారు.
Latest News