తిరుమల మాత్రమే కాదు మరో ఐదు ఆలయాలకు కల్తీ నెయ్యి.. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు!
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:41 PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ అక్రమాలు బయటపడ్డాయి. ఈ డెయిరీ తిరుపతిలోని ఓ చిన్న డెయిరీ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, ద్వారకా తిరుమల వంటి దేవాలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా అయింది. భోలేబాబా సంస్థ తిరుపతిలోని డెయిరీకి కమీషన్లు చెల్లించి.. ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యిని దేవాలయాలకు పంపినట్లు తేలిందని సమాచారం. ముందు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని భావించారు.. కానీ, ఇతర దేవాలయాలకు కూడా సరఫరా జరిగినట్లు గుర్తించారు.


మరోవైపు నెల్లూరు ఏసీబీ కోర్టులో భోలేబాబా డెయిరీ జనరల్‌ మేనేజర్‌ హరిమోహన్ రాణా మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టగా ఏపీపీ వాదనలు వినిపించారు. 'టీటీడీ 2022లో భోలేబాబా డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత 'మాల్‌గంగ' అనే మరో డెయిరీని తెరపైకి తెచ్చారు. ఈ కంపెనీకి కమీషన్ చెల్లించి కల్తీ నెయ్యిని తయారు చేశారు.. సుగంధ ఆయిల్స్, పామోలిన్ వంటి పదార్థాలను కలిపారు. భోలేబాబా డెయిరీనే పరోక్షంగా టీటీడీకి పంపింది. గతంలో కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ రాణా చెప్పారు.. అయితే అది అవాస్తవమని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్‌మైండ్‌.. హరిమోహన్ ఈ ఎపిసోడ్‌లో సూత్రధారి.. బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తారు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది' అని ఏపీపీ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. తిరుమల ఆలయానికి కల్తీ నెయ్యి ఘటనలో ఉత్తరాఖండ్‍ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను సిట్ అరెస్ట్ చేసింది. తిరుపతి సిట్‌ కార్యాలయంలో వీరిని ప్రశ్నించారు.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM