ఏపీలో రైలు ప్రయాణికుల కోసం హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 04:45 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు నడుపుతోంది. ఏపీ నుంచి చర్లపల్లి, లింగపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జులై 5 నుంచి 2026 మార్చి 28 వరకు కాకినాడ టౌన్‌ - చర్లపల్లి (07447) ప్రత్యేక రైలు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరుతుంది.. మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లికి వస్తుంది. ఈ రైలు కాకినాడలో ప్రారంభమై.. సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. జూలై 6 నుంచి మార్చి 29 వరకు చర్లపల్లి - కాకినాడ టౌన్‌ (07448) ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు వస్తుంది.


జులై 2 నుంచి మార్చి 30 2026 వరకు కాకినాడ టౌన్‌ - లింగంపల్లి (07445) ప్రత్యేక రైలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10కి బయలుదేరుతుంది.. మరుసటి రోజు ఉదయం 8.50కి లింగంపల్లి వస్తుంది. కాకినాడలో బయల్దేరే ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, చర్లపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. జులై 3 నుంచి మార్చి 31 వరకు లింగంపల్లి - కాకినాడ టౌన్‌ (07446) ప్రత్యేక రైలు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.


మరోవైపు చర్లపల్లి - తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే పొడిగించింది. జులై మొదటి వారం నుంచి జులై నెలాఖరు వరకు ఉంటాయి. కొన్ని ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట' స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లు 'జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట' స్టేషన్‌లలో ఆగుతాయి అన్నారు. మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది దక్షిణమధ్య రైల్వే.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM