|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:30 PM
కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా అంటూ ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. ఈరోజు (శుక్రవారం) కమ్మ వారి సేవా సమితి ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ.. కమ్మ వారు అన్ని పార్టీల్లో ఉన్నారని.. వైసీపీ పార్టీలో కూడా ఉన్నారన్నారు. ఓదార్పు యాత్రలో కమ్మ కులం గురించి ప్రస్తావన అనేది అనవసరమైన విషయమన్నారు. కొడాలి నాని లాంటి తమ సామాజిక వర్గం వారితో తమనే తిట్టించారని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిని అసెంబ్లీలో తిట్టించారన్నారు. అమరావతిని కమ్మరావతి అన్నారని.. అధికారులకు కులాలను ఆపాదించి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News