|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:31 PM
ఈరోజు ఉదయం పొన్నూరు మండలం చింతలపూడిలో రైతులకు వ్యవసాయ డ్రోన్లను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో సాంకేతికత వినియోగం తప్పనిసరిగా మారిందని అన్నారు. కూలీల కొరత అధిగమించేందుకు పరికరాలు, యాంత్రీకరణ అవసరమన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు పురుగు మందుల పిచికారిలో ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం రాయితీతో డ్రోన్లు ఇస్తున్నాయన్నారు. గ్రామంలో చదువుకున్న యువతకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తద్వారా వారికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి డ్రోన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.
Latest News