|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:26 PM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. జగన్ బయటకు రావడానికి ముందు ‘ఒక శవం లేవాలి.. వస్తే రెండు శవాలు లేవాలి’ అంటూ విమర్శలు చేశారు. వైసీపీ నేతలు గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన ఘనులని.. కొబ్బరిబోండాలు నరుక్కోడానికి, పరోటా పిండి పిసుక్కోవడానికే వారి శేష జీవితం సరిపోతుందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారని, ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఏదో జరిగిపోతోందనే ప్రచారం తీసుకెళ్లే ప్రయత్నం చేశారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి రచ్చచేసి, ఏమి సాధించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఏపీకి రావడానికి ముందు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే విషప్రచారం చేయాలని చూశారని, జగన్ అపరచితుడని ఏపీ ప్రజలు అంటున్నారని.. రాజకీయాలకు అనర్హుడిగా భావిస్తున్నారని ఆయన అన్నారు.
Latest News