|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:22 PM
కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రికత్త కొనసాగుతోంది. మరోసారి కుర్చీల వివాదం తెరపైకి వచ్చింది. సమావేశ మందిరంలో మేయర్ కుర్చీ పక్కన ఎక్స్ అఫీసియో హోదాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కమిషన్ కుర్చీలను ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. సర్వసభ్య సమావేశం జరిగే కౌన్సిల్ హాల్‌లోకి రాకుండా తన చాంబర్లోనే మేయర్ సురేష్ బాబు, వైసీపీ సభ్యులు ఉన్నారు. మేయర్ సురేష్ బాబు, వైసీపీ పాలకవర్గ సభ్యులు ఒక హాల్లో.. ఎమ్మెల్యే మాధవరెడ్డి సమావేశం హాల్లో ఉన్నారు. ఈ క్రమంలో వేరువేరుగా కూర్చోవడంతో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభంకాని పరిస్థితి.ఈ సందర్భంగా నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. తన ప్రమేయం లేకుండా కమీషనర్ మీటింగ్ హాల్లో సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సమావేశం పలానా చోట నిర్వ హించాలని ఎక్కడా లేదని.. ప్రాంగణంలో నిర్వహిస్తామని కమిషనర్‌కు నోటీసులు పంపామని తెలిపారు. కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్మించాలని, అందుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కమిషనర్, ఉద్యోగులు.. ఎమ్మెల్యే తోత్తులుగా వ్యవహరిస్తున్నారని మేయర్ సురేష్ బాబు ఆరోపించారు.
Latest News