|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:21 PM
ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ కూడా తన మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. ‘అమ్మ ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలం... నా మార్గదర్శి.. ప్రజలకు సేవలు చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల ఆమె చూపే అంకితభావం స్ఫూర్తిదాయకం... ప్రతిరోజూ అమ్మను ఆరాధిస్తాను.. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేసిన ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని కోరుకుంటూ నారా లోకేష్ పోస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణీ, కుమారుడు దేవాన్ష్ కూడా భువనేశ్వరికి పుట్టునరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News