నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 10:33 AM

క్రికెట్ అభిమానులకు మళ్లీ పండగ స్టార్ట్ అవ్వబోతుంది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈసారి యువ భారత్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్‌తో కుర్రాళ్లతో బలమైన టీమ్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో లైవ్‌లో వీక్షించవచ్చు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పాక.. టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కావడం గమనార్హం. అయితే గత 18 ఏళ్లుగా టీమిండియా ఇంగ్లాండ్‌లో ఒక్క టెస్టు సిరీస్ కూడా నెగ్గలేదు. మరి 25 ఏళ్ల గిల్ సారథ్యంలోని భారత్.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది తేలాల్సి ఉంది. సీనియర్లు లేకపోవడంతో యువ భారత్ బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెండింగ్లే వేదికగా ఈ పోరు జరగనుంది.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM