|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:52 PM
యూపీలోని బలరాంపూర్ జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 12వ తేదీ రాత్రి సంత నుంచి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులు శివ యాదవ్, అక్తర్ రజా, రాజ్ ఖురేషి, ఫిరోజ్‌గా గుర్తించారు. అత్యాచారం తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించి పారిపోయారని పోలీసులు తెలిపారు.
Latest News