|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:55 PM
జాతీయ రహదారులపై ప్రయాణించే నాన్ కమర్షియల్ వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టనుంది. రూ.3వేలు చెల్లించి తీసుకునే ఈ పాస్ ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు వర్తించనుంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గించడం, వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రయాణదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ విధానం ప్రారంభించనున్నారు.వార్షిక పాస్ వల్ల ఒక్కో ట్రిప్‌నకు అయ్యే సగటు ఖర్చు రూ.15 మాత్రమేనని గడ్కరీ వెల్లడించారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వారు కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ వార్షిక పాస్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కమర్షియల్ వాహనదారులు ఎవరైనా పాస్ తీసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే డీయాక్టివేట్ చేస్తామని కేంద్రం హెచ్చరించింది. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉండే టోల్‌ప్లాజాలకు మాత్రమే పనిచేస్తుందని కేంద్రం పేర్కొంది.
Latest News