|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:02 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓ వైపు యోగా జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ శ్రేణులు రఫ్ఫా రఫ్ఫా అంటున్నారని మండిపడ్డారు. చంపండి.. నరకండి.. అని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని నిలదీశారు సీఎం చంద్రబాబు. ఇరుకు వీధుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా అని సీఎం చంద్రబాబు అడిగారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా అని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా అని ప్రశ్నించారు. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రౌడీయిజం చేసేవారిని, చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలేయాలా అని నిలదీశారు. ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా అన్నారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు.
Latest News