|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:00 PM
పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అని ప్లాకార్డ్ ప్రదర్శించి బెదిరించిన షేక్ బుజ్జిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గంగమ్మ తల్లి జాతరలో మాదిరిగా ‘రఫ్ఫా, రఫ్ఫా నరికేస్తామ్’ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించిన రవి తేజపై కూడా కేసు నమోదు చేశారు. వారిపై దర్యాప్తు జరిపి మారి కొన్ని సెక్షన్లు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే బీఎన్ఎస్‌లోని సెక్షన్ 352, 351 పార్ట్ 2 రెడ్ విత్ 3 (5) సెక్షన్లు కింద సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువురు మరణాలకు కారకులైన వారిపై కూడా రెండు కేసులు నమోదు చేశారు. పరామర్శకు వెళ్లి పోలీసులు విధించిన నిబంధనలు అతిక్రమించిన వ్యవహారంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఇప్పుటికే నిన్నటి ఘటనల్లో నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.
Latest News