|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:58 PM
11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం యోగాంధ్రపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. యోగా జీవితంలో భాగం కావాలన్నారు. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు. శస్త్ర చికిత్స కన్నా నివారణ మంచిదని.. యోగా కూడా అలాంటిదే అని అన్నారు. యోగాపై భవిష్యత్తులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ, కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని.. కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. 120 శాతం లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 88.71 శాతం మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్‌గా నిర్వహించబోతున్నామని.. ఇది గిన్నిస్ బుక్‌లో ఎక్కబోతుందన్నారు. బాడీ ఫిట్‌నెస్‌కు, వ్యాధులు రాకుండా నిరోధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాధులు వస్తే మెడిసిన్స్ వాడటం, శస్త్ర చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదన్నారు. గత నెల రోజులు నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం బాగా జరిగిందన్నారు. దాదాపు 1 కోటి 77 లక్షల మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని తెలిపారు.
Latest News