|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:42 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఈ నెల 21వ తేదీ (శనివారం) విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌తో పాటు ఎస్ కోట శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు ఆనందపురం జుంక్షన్ నుంచి బస్సులో ప్రయాణించి ట్రయల్ రన్‌లో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుంచి 30 వేల మంది పాల్గొన్నారు. విజయనగరం నుంచి విశాఖలో జరిగే యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు. ముందుగానే ట్రయిల్ రన్ చేపట్టారు. ఇందుకోసం గురువారం 10 బస్సుల్లో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు, యోగాలో పాల్గొనేవారు ట్రయిల్ రన్‌లో పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి సుమారు 100 మందికిపైగా విశాఖపట్నం బయలుదేరారు. యోగలో పాల్గొనే ప్రజలు, విద్యార్థులు, అధికారులను ఉత్సాహ పరిచేందుకు ఇంత దూరం బస్సుల్లో ప్రయాణం చేసిన కలక్టర్‌ను పలువురు అభినందించారు.
Latest News