|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:39 PM
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని లోకేష్.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు.
Latest News