|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:44 PM
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి బారికేడ్లను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతని ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు . దీంతో సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. రప్పా.. రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించడం పట్ల టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. వారి ఫిర్యాదు మేరకు ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవితేజ అనే వైసీపీ కార్యకర్త ప్లకార్డులను ప్రదర్శించినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Latest News