|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:55 PM
ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ గురువారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఛైర్మన్ తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం ఆమెను డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. సోనియాకు ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి అవసరమని సూచించారు.
Latest News