|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:07 PM
బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాతమాగులూరు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Latest News