నాలుగేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఫైనల్.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫార్మాట్ మార్చాలన్న ఏబీ డివిలియర్స్
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:32 PM

శుక్రవారం (జూన్ 20) నుంచి జరగనున్న భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్- డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. అలా రెండేళ్లపాటు ఈ డబ్ల్యూటీసీ సైకిల్ కొనసాగుతుంది. ఫైనల్ చేరిన జట్ల మధ్య మ్యాచ్‌ను 2027లో నిర్వహిస్తారు. ఇటీవలే 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సుదీర్ఘ కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని సాధించింది దక్షిణాఫ్రికా.


అయితే దక్షిణాఫ్రికాకు ఫైనల్‌లో బెర్త్ దక్కడంతో.. డబ్ల్యూటీసీ ఫార్మాట్‌పై ఈ మధ్య క్రికెట్ నిపుణులు, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పాయింట్ల సిస్టమ్, మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆస్ట్రేలియా కంటే సులభంగా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరిందన విమర్శలు వచ్చాయి.


ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలయర్స్ డబ్ల్యూటీసీ ఫార్మాట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫార్మాట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అన్ని జట్లు ఒకేలా ఆడలేదని.. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. డబ్ల్యూటీసీ ఫార్మాట్‌ను మెరుగుపరచాలని, ప్రతి జట్టుకు సమాన అవకాశాలు ఇవ్వాలని డివిలియర్స్ సూచించారు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ గెలవడం చాలా గొప్ప విషయమని డివిలియర్స్ అన్నాడు. ఆ జట్టు చాలా కష్టపడిందని, వారు గెలవడానికి అర్హులని ఆయన కొనియాడారు. దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు ఇది గర్వకారణమని ఆయన అన్నాడు.


"(డబ్ల్యూటీసీ ఫార్మాట్‌లో) కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. డబ్ల్యూటీసీ తర్వాతి సైకిల్ కోసం విడుదల చేసిన షెడ్యూల్ చూశాను. అందులో కొన్ని మార్పులు చేశారు. కానీ, ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. టెస్ట్ ఆడే అన్ని దేశాలకు ఇది వీలైనంతగా న్యాయం చేసేలా ఉండాలి" అని డివిలియర్స్ అన్నాడు.


నాలుగేళ్లకోసారి డబ్ల్యూటీసీ సైకిల్..


ప్రతి జట్టు ఒకదానితో ఒకటి ఆడేలా నాలుగేళ్ల సైకిల్ ఉండాలని డిలిలియర్స్ అభిప్రాయపడ్డారు. "అన్ని దేశాలతో ఆడిన తర్వాతే.. ఫైనల్‌కి వెళ్లామే భావన కలగాలి. అందుకోసం నాలుగేళ్ల సైకిల్ ఉంటే బాగుంటుంది. గతంలో వన్డే ఇంటర్నేషనల్స్‌లో కూడా ఇలా చేశాం. టెస్ట్ క్రికెట్‌లో ఎందుకు చేయకూడదు? ఇది మంచి ఆలోచన. దీని ద్వారా నిర్వాహకులకు సమయం దొరుకుతుంది. అప్పుడు బాగా బ్యాలెన్స్డ్‌గా ఉండే సిస్టమ్ తీసుకురావచ్చు" అని ఆయన అన్నారు.


డబ్ల్యూటీసీ ఫార్మాట్‌పై డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు డివిలియర్స్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అయితే డబ్ల్యూటీసీ ఫార్మాట్‌ను మరింత మెరుగుపరచడానికి ఐసీసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM