|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:34 PM
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ స్వాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌పై స్వాన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దాంతో ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే హీటెక్కింది. భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ తమకు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది అంటూ గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌కు ముందు ఇది ఓ ప్రాక్టీస్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంగ్లండ్ జట్టు కూడా దీన్ని ఓ వార్మప్ మ్యాచ్‌లాగే పరిగణించాలంటూ స్కై స్పోర్ట్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ అన్నాడు.
"ఇది ఓ రకమైన వార్మప్ మ్యాచ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు సరైన వార్మప్ మ్యాచ్. కానీ ఇండియాకు మాత్రం ఇదో పెద్ద సిరీస్" అంటూ స్వాన్ స్కై స్పోర్స్ట్ క్రికెట్‌తో అన్నాడు. "చివరగా గత రెండు, మూడు సార్లు ఇండియాకు వెళ్లాం. అక్కడ మేం పూర్తిగా విఫలమై ఓడిపోయాం. ఇప్పుడు మా సొంత దేశంలో, మేం ఇండియాను ఓడించాల్సిన ఉంది. మేం బాగా ఆడాలి కూడా. ఎందుకంటే వాళ్లకి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేరు. అవును.. వాళ్లు చాలా మంచి ప్లేయర్లు. ఇంగ్లండ్ కచ్చితంగా సిరీస్ గెలవాలి. నేనయితే 4-1, 3-2 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బాగా రాణించి, యాషెస్‌లో తలబడాలని కోరుకుంటున్నాను" అని స్వాన్ పేర్కొన్నాడు.
టీమిండియాతో సిరీస్ యాషెస్‌కు వార్మప్ లాంటిది అన్న కామెంట్లపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. భారత క్రికెట్ జట్టు అభిమానులతో పాటు కొందరు ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్వాన్ కామెంట్స్‌ను తప్పుబడుతున్నారు. రోహిత్, కోహ్లి లేకుండా కేవలం యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యలకు సరైన సమాధానం చెబుతుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ - ఇండియా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. చివరి టెస్టు ఆగస్టు 4న జరగనుంది.
Latest News