జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా జరగనున్న,,,, భారత్‌- ఇంగ్లాండ్ తొలి టెస్టు
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:31 PM

భారత్‌- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025- 27ను భారత్.. ప్రారంభించనుంది. ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్ తొలిసారి సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత్‌- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎన్ని టెస్టులు జరిగాయి? అందులో ఎవరెన్ని గెలిచారు? వంటి గణాంకాలు ఇప్పుడు చూద్దాం..


హెడ్ టు హెడ్ రికార్డ్స్..


భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 136 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. అందులో అత్యధికంగా ఇంగ్లాండ్ జట్టు 51 మ్యాచ్‌లలో గెలుపొందింది. భారత్ 35 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 50 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.


ఇంగ్లాండ్‌ గడ్డపై భారత జట్టు ప్రదర్శన..


ఇంగ్లాండ్ వేదికగా భారత్‌ 67 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 9 మ్యాచ్‌లలో గెలుపొందింది. 36 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 22 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


అత్యధిక రన్స్..


భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా జో రూట్ ఉన్నాడు. అతడు 30 మ్యాచ్‌లలో 58 సగటుతో 2,846 పరుగులు స్కోరు చేశాడు.


జో రూట్: 30 మ్యాచ్‌లలో 2,846 రన్స్‌


సచిన్ టెండూల్కర్: 32 మ్యాచ్‌లలో 2,535 పరుగులు


సునీల్ గావస్కర్: 38 మ్యాచ్‌లలో 2,483 రన్స్‌


అలిస్టర్ కుక్‌: 30 మ్యాచ్‌లలో 2,431 పరుగులు


విరాట్ కోహ్లీ: 28 మ్యాచ్‌లలో 1991 రన్స్‌


రాహుల్ ద్రవిడ్: 21 మ్యాచ్‌లలో 1950 పరుగులు


అత్యధిక వికెట్ల వీరులు..


జేమ్స అండరన్స్: 39 మ్యాచ్‌లలో 149 వికెట్లు


రవిచంద్రన్ అశ్విన్: 24 మ్యాచ్‌లలో 114 వికెట్లు


బీఎస్.చంద్రశేఖర్: 23 మ్యాచ్‌లలో 95 వికెట్లు


అనిల్ కుంబ్లే: 19 మ్యాచ్‌లలో 92 వికెట్లు


బిషన్ సింగ్ బేడీ: 22 మ్యాచ్‌లలో 85 వికెట్లు


కపిల్ దేవ్‌: 27 మ్యాచ్‌లలో 85 వికెట్లు


అత్యధిక టోటల్స్‌..


భారత్‌- 759/7 డిక్లేర్డ్‌, చెన్నై 2016


ఇంగ్లాండ్‌- 710/7 డిక్లేర్డ్‌, బర్మింగ్‌హోమ్ 2011


అత్యల్ప స్కోరు..


భారత్‌- 42 ఆలౌట్‌, లార్డ్స్ ఇంగ్లాండ్‌ 1974


ఇంగ్లాండ్‌- 81 ఆలౌట్, అహ్మదాబాద్ 2021

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM