|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:31 PM
జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా భారత్‌తో జరిగే మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్న తుది జట్టును ఇంగ్లండ్ తాజాగా ప్రకటించింది. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.భారత ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (KL Rahul)లను జాఫర్ ఎంపిక చేశాడు. మూడో స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కొచ్చని అంచనా వేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అభిమన్యు, ఐపీఎల్ 2025లో అదరగొట్టిన సాయి సుదర్శన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. జాఫర్ ఎంపిక చేసిన భారత్ తుది జట్టులో నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్, ఐదో స్థానంలో రిషభ్ పంత్ ఉన్నారు. వసీమ్ తర్వాతి రెండు స్థానాల్లో కరుణ్ నాయర్, రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు. ఎనిమిదో స్థానంలో పేసర్ శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లలో ఒకరు చోటు దక్కించుకుంటారని అభిప్రాయపడ్డాడు. వసీమ్ చివరి మూడు స్థానాలకు ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లను ఎంపిక చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది జట్టు ఎంపిక బాగుందని పేర్కొంటుండగా.. మరికొందరు బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు. శార్దూల్‌కు బదులు అంశుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
Latest News