|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 06:36 PM
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12వ తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటలోనే మొత్తంగా 274 మంది మృతి చెందగా.. విమానంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. అతడే విశ్వాస్ కుమార్. స్వల్ప గాయాలతో మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన ఈయన తాజాగా కోలుకున్నారు. అయితే ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లకుండా.. తన సోదరుడు అజయ్ అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడే అతడి పాడెమోస్తూ కన్నీరు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏప్రిల్ 12వ తేదీన ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 242 మందితో వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్ప కూలిపోయింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం సహా జనావాసాలపై విమానం పడగా.. విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలతో బయట పడ్డాడు. మృత్యుంజయుడిగా నిలిచి ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. అతడే విశ్వాస్ కుమార్. ఆ తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నెన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా ఈయనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆయన మంగళ వారం రోజు రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా.. బుధవారం సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అతడి సోదరుడు అజయ్ కుమార్‌కు.. బుధవారం రోజు ఉదయమే డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో అజయ్ మృతదేహాన్ని గుర్తించిన వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఈరోజు డయ్యూలోని తన స్వగృహానికి తీసుకెళ్లి మరీ అతడికి అంత్యక్రియలు నిర్వహించారు.
ముందు రోజు రాత్రే ఆస్పత్రి నుంచి వచ్చి విశ్వాస్ కుమార్.. సోదరుడి పార్థివ దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ప్రమాదానికి ముందు వరకు తనతోనే ఉన్న సోదరుడు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయారు. స్వల్ప గాయాలు, చిన్న చిన్న కట్లతోనే ఉన్న ఆయన సోదరుడి పాడెను మోస్తూ.. గుండెలవిసేలా రోదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరు కంటతడి పెడుతున్నారు. మీ సోదరుడు ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు.
Latest News