|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 11:11 AM
కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి కొట్టిన టీడీపీ కార్యకర్త. రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన.. పిల్లల చదువుకు హామీ. అన్ని విధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా. చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు . ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం . గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు
Latest News