|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 10:48 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. తొలుత నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల బాట పడుతున్నాయి. ఉదయం 9.26గంటల సమయంలో సెన్సెక్స్ 96 పాయింట్ల లాభంతో 81,679 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 24,893 వద్ద ఉన్నాయి.
Latest News