సైకిల్ దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వీడియో వైరల్
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:52 PM

 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ తొక్కుతూ కిందపడ్డారు. విధాన సౌధ దగ్గర సైకిల్ తొక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బ్యాలెన్స్ తప్పి కింద పడటంతో అక్కడున్న వాళ్లంతా వెంటనే ఆయనకు సహాయం చేశారు. పైకి లేపి మరీ లోపలికి తీసుకెళ్లారు. అయితే కాసేపట్లోనే తేలుకున్న డీకే శివకుమార్ బాగానే పైకి నడుకుంటూ వెళ్లగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఈ ఘటన వల్ల ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయని వార్తలు వస్తున్నాయి.


ఆదివారం ఉదయం బెంగళూరు నగరంలో జరిగిన సైకిల్ ర్యాలీలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. విధాన సౌధ వద్దకు చేరుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా ఆయన సైకిల్ అదుపుతప్పి కుడి వైపునకు ఒరిగిపోయింది. దీంతో శివకుమార్‌ సైకిల్ నుంచి జారి కిందపడ్డారు. అప్పుడక్కడ మెట్లు ఉండగా.. వాటిపైనే ఆయన చేతులు, కాళ్లు పడి చిన్నగా గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటన ఆకస్మికంగా జరగడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.


వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, అక్కడి పార్టీ నాయకులు డీకే శివకుమార్‌ను పైకి లేపారు. కానీ ఒక్కసారిగా కింద పడడంతో.. ఆయనకు మోచేతికి, మోకాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి పెను ప్రమాదం జరక్కపోవడం, తీవ్ర గాయాలు కాకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. డీకే శివకుమార్‌ స్వయంగా పైకి లేచి నిలబడటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చిరునవ్వుతోనే ముందుకు సాగారు.


ఈ ఘటనపై డీకే శివకుమార్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇలా వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని కొందరు, హుషారుగా ఉండాలి కానీ మరీ ఇంత అవసరం లేదని చెబుతున్నారు. నాయకులు ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని పలువురు నెటిజెన్లు కామెంట్ల రూంపలో తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు.

Latest News
Trump-backed Vivek Ramaswamy wins Republican nomination for Ohio governor Wed, May 06, 2026, 02:17 PM
Patna police's traffic advisory on key routes ahead of Bihar Cabinet expansion Wed, May 06, 2026, 01:51 PM
Three killed in early morning blaze at Bhubaneswar apartment Wed, May 06, 2026, 01:45 PM
Centre raises sugarcane FRP: Karnataka BJP sees it as relief, slams state govt over unpaid dues Wed, May 06, 2026, 01:40 PM
Congress' newly elected MLAs to meet in Thiruvananthapuram on Thursday Wed, May 06, 2026, 01:39 PM