రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరు మార్పు
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:38 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పాదాల వద్ద ఉన్న రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీవారి పేరు పెట్టాలంటూ ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.


బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం కోరిందన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఈ నేపథ్యంలో బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శ్రీవారి ఆలయం చిన్నదిగా ఉందని, పెద్ద ఆలయం నిర్మించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరినట్లు చెప్పారు. అందుకు టీటీడీ అంగీకరించిందని, స్థలం కేటాయించగానే ఆలయ నిర్మాణం మొదలెడతామన్నారు.


మరోవైపు తిరుమలలో త్వరలోనే ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. కేంద్ర మంత్రి కుమారస్వామి టీటీడీకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఇవి అందుబాటులోకి వస్తే తిరుమలలో శ్రీవారి భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ ల్యాబ్‌ నిర్మాణం కోసం స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వివరించారు. ఈ ప్రయోగశాల ద్వారా నీరు, నెయ్యి, పప్పుధాన్యాల నాణ్యతను చెక్ చేయనున్నారు.


మరోవైపు టీటీడీ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలపై శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ విద్యాసంస్థలలోని విద్యార్థులకు తెలుగు సంస్కృతి, సనాతన ధర్మంపై శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి మన వారసత్వం పేరు పెట్టారు. ఇక వరలక్ష్మీ వ్రతం రోజు.. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM