|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:44 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఈరోజు 18 గంటల సమయం పడుతోంది. ఏటీజీహెచ్ వరకూ క్యూలైన్లు పూర్తిగా నిండి ఉన్నాయి. నిన్న 84,681 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.43 కోట్ల ఆదాయం వచ్చింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల ప్రవాహం మరింతగా పెరిగింది. దర్శనానికి సమయం కేటాయించుకుంటూ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
Latest News