|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:43 AM
AP: యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు ఆర్కే బీచ్‌లో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 21వ తేదీ వరకు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు సాధారణ అనుమతి ఉండదన్నారు. నగరవాసులు సహకరించాలని సీపీ కోరారు.
Latest News