|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:06 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోపణలు చేయలేదు. నీతి నిజాయితీతో ఒక సమర్థవంతమైన నాయకత్వంతో మోదీ పాలన కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు సైతం భారత దేశం వైపు చూసేలా మోదీ పాలన సాగుతోంది. అన్ని సామాజిక వర్గాల వారికి పెద్ద పీట వేసి పాలన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన అనేక పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా ప్రణాళికలు ఉంటున్నాయి. కరోనా సమయంలో పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో రేషన్ అందించారు. 4 కోట్ల ప్రజలకి ఇళ్లు కట్టించారు. మౌలిక రకమైన మార్పులు తీసుకొచ్చారు’ అని అన్నారు.
Latest News