వర్షాకాలంలో కూడా పోలవరం పనులు కొనసాగేలా చర్యలు చేపడుతాం
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:08 PM

పోలవరం ప్రాజెక్ట్  నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని అన్నారు. డీ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు తమకు అర్థం కాలేదని, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని నాటి వైసీపీ మంత్రులు అన్నారని గుర్తుచేశారు మంత్రి రామానాయుడు. ఇవాళ(మంగళవారం)పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతానికి పైగా పూర్తయ్యాయని వివరించారు. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు .

Latest News
Adani Power gets ‘Buy’ rating, target price set at Rs 187: Antique Broking Tue, Dec 16, 2025, 11:18 AM
Key players face acid tests in Maharashtra Municipal Corporation elections Tue, Dec 16, 2025, 11:17 AM
'Meaningful expansion of partnership': PM Modi on outcome of meeting with Jordan King Tue, Dec 16, 2025, 11:16 AM
Rajasthan's Neem Ka Thana Railway Station gets bomb threat, no suspicious object found Tue, Dec 16, 2025, 11:15 AM
My visit will boost bilateral linkages, says PM Modi after arriving in Jordan Mon, Dec 15, 2025, 06:01 PM