రాష్ట్రంలో మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముసలి వరకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:41 PM

మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేశారని చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. ఆర్‌కె రోజా మాట్లాడుతూ...  టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు వదిలిపెట్టకుండా ఉన్మాదులు అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు అనేకం. వారికి రక్షణ కల్పించాల్సిన హోం మంత్రి, పోలీసులు కనీసం స్పందించడం లేదు. ఆ బాధ్యత నుంచి ఈ ప్రభుత్వం పారిపోయింది. హోం మంత్రి మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కల్పించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంది. నగరి నియోజకవర్గంలో ఒక చిన్నారి మీద అత్యాచారం చేసి చంపేసి పూడ్చేస్తే ఎస్పీని, పోలీసు యంత్రాంగాన్ని పంపించి దాన్ని కనుమరుగు చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. వైయస్ఆర్‌సీపీ సపోర్టుతో గ్రామస్తులు తిరగబడితే విధిలేని పరిస్థితుల్లో ఈ హోం మంత్రి అనిత బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు అని మండిపడ్డారు.

Latest News
India-Oman free trade pact to bolster economic engagement with Gulf Thu, Dec 18, 2025, 12:32 PM
Eleven months ago, I inherited a mess, and I'm fixing it: Trump Thu, Dec 18, 2025, 12:27 PM
Pax Silica signals US shift from chips to full AI stack: Officials Thu, Dec 18, 2025, 12:24 PM
CRPF trooper dies of suspected cardiac arrest in J&K's Anantnag Thu, Dec 18, 2025, 12:19 PM
Pax Silica signals US shift from chips to full AI stack: Officials Thu, Dec 18, 2025, 12:19 PM