|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:14 PM
రాష్ట్రంలో రోజురోజుకు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై రెండేళ్లుగా 14 మంది యువకులు అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా బయటపడింది. బాలికను చిత్ర హింసలకు గురిచేయడంతో తట్టుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Latest News