రూ.10 లక్షల విలువైన నగలన్నింటినీ హనీమూన్‌కు తెప్పించి,,,మేఘాలయా కేసులో సంచలనాలు
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:15 PM

రూ.10 లక్షల విలువైన నగలన్నింటినీ హనీమూన్‌కు తెప్పించి,,,మేఘాలయా కేసులో సంచలనాలు

హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన అక్కడే హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు గురించి అందరికీ తెలిసిందే. భార్య సోనమే సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించినట్లు అంతా భావిస్తుండగా.. తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్‌కు వెళ్లేముందు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ధరించాలని భర్తకు చెప్పగా.. ఆమె కోరిక మీదకే వాటిని వేసుకుని టూర్‌కు వెళ్లినట్లు అతడి తల్లి చెబుతున్నారు. అలాగే హనీమూన్‌కు సంబంధించిన టికెట్ బుకింగ్స్, ప్లానింగ్ వంటివన్నీ సోనమే చేసిందని వివరించారు. కాకపోతే ఆమె రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదని వెల్లడించారు. అలాగే మృతుడి సోదరుడు సైతం సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పారు.


మధ్య ప్రదేశ్ ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీకి.. సోనమ్‌తో మే 11వ తేదీన వివాహం జరిగింది. అయితే 20వ తేదీన వీరిద్దరూ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. 22వ తేదీన వీరి ఆచూకీ గల్లంతు అయింది. అయితే 11 రోజల తర్వాత రఘవంశీ మృతదేహం లభ్యం కాగా.. తాజాగా సోనమ్ ఉత్తర ప్రదేశ్‌లోని గాజీపుర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈక్రమంలోనే పోలీసుల ప్రాథమిక విచారమలో.. ఈమెనే తన ప్రియుడు రాజ్ కుష్వాహా కోసం ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


ముఖ్యంగా మృతుడి రాజా రఘువంశీ తల్లి ఉమ మాట్లాడుతూ.. హనీమూన్ కోసం వెళ్లేముందు తన కొడుకును రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ధరించమని కోడలు సోనమ్ చెప్పినట్లు వెల్లడించారు. ఆమె చెప్పడం వల్లే తన కొడుకు డైమండ్ ఉంగరం, బంగారు చైన్, బ్రేస్‌లెట్ ధరించాడని చెప్పారు. తాను వద్దన్నా భార్య చెప్పిందని వేసుకుని వెళ్తున్నట్లు కుమారుడు తెలిపాడని పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా మేఘాలయకు చెందిన అన్ని బుకింగ్‌లు సోనమే చేసిందన్నారు. ట్రావెల్, బస ఇలా అన్నీ ఆమెనే ఏర్పాట్లు చేసిందని.. కాకపోతే రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదన్నారు.


అలాగే గౌహతికి ప్లాన్ చేసుకున్న వీరు ఎందుక్ షిల్లాంగ్ వెళ్లారో కూడా తనకు అర్థం కావడం లేదని ఉమ అన్నారు. తన కుమారుడిని చంపింది సోనమే అని తేలితే మాత్రం ఆమెకు కచ్చితంగా ఉరిశిక్ష వేయాలని కోరారు. మరోవైపు మృతుడి సోదరుడు విపుల్ రఘువంశీ మాట్లాడుతూ.. రాజ్ కుష్వాహా పేరు తాను కూడా విన్నానని చెప్పుకొచ్చారు. రాజ్ కుష్వాహా పేరు వినిపిస్తోందంటే.. సోనమ్ కూడా ఈ హత్యలో పాల్గొందని తనకు అనిపిస్తున్నట్లు వివరించారు.


అయితే అతడు సోనమ్ ప్రేమికుడా లేదా అన్నది తనకు తెలియదని.. కాకపోతే అతడు ఆమె దగ్గర పని చేసే ఉద్యోగిగా తనకు తెలుసన్నారు. చాలా సార్లు వారిద్దరూ ఫోన్లు మాట్లాడుకోవడం కూడా తాను విన్నానని పేర్కొన్నారు.


అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల గురించి కూడా తనకు ఏమీ తెలియదని చెప్పారు. తన సోదరుడితో పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి పని చేస్తుందని తామెవరూ కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే వారు కామాఖ్య ఆలయానికి వెళ్లాల్సి ఉండగా.. షిల్లాంగ్ ఎందుకు వెళ్లారో తమకు అర్థం కావడం లేదన్నారు. ఇద్దరిలో ఎవరు మేఘాలయ పర్యటనను ప్లాన్ చేశారో కూడా తనకు తెలియదని చెప్పారు. కాకపోతే వారు మాత్రం రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోలేదని స్పష్టం చేశారు.

Latest News
Air India crash: Both engines shut down after shift in fuel control switches; one pilot said he ‘didn’t do it’ Sat, Jul 12, 2025, 11:46 AM
Wildfires continue in Bosnia Sat, Jul 12, 2025, 11:38 AM
India's strong resolve builds global resilience against terrorism Sat, Jul 12, 2025, 11:28 AM
Liverpool retire Diogo Jota's jersey number 20 Sat, Jul 12, 2025, 11:26 AM
Mexican president slams US raids on farmworkers Sat, Jul 12, 2025, 11:22 AM