![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:43 PM
అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురిచేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తల్లీ కుమారులు శ్వేతాఖాన్, ఆర్యన్‌ఖాన్‌లు ఓ యువతిని ఉద్యోగం పేరిట ట్రాప్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్‌గా పని చేయాలని బలవంతం చేయగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 6 నెలలుగా ఓ ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తల్లీ కుమారులు శ్వేతాఖాన్, ఆర్యన్‌ఖాన్‌లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ముసుగులో అశ్లీల వీడియోల రాకెట్‌ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతున్నారు. ఇందులోభాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ యువతులను ఉద్యోగం పేరుతో నమ్మించేవారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని వారిని బలవంతం చేసేవారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణా జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఫేస్‌బుక్‌లో ఆర్యన్‌ను సంప్రదించింది. హౌరాలోని తమ నివాసానికి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అతడు నమ్మబలకడంతో ఉద్యోగం గురించి చర్చించడానికి వారి ఇంటికి వెళ్లింది. ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్ డాన్సర్ వృత్తిలోకి దించడానికి ప్రయత్నించారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమె మొబైల్ లాక్కొని, ఓ ఫ్లాట్‌లో బంధించారు. ఆరు నెలల పాటు తనను ఇనుపరాడ్డుతో తీవ్రంగా కొడుతూ, హింసించేవారని.. నాలుగు రోజులకు ఒకసారే భోజనం పెట్టేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు.
Latest News