వైఎస్ షర్మిల అనంతపురం పర్యటన ఈ నెల 11న
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:55 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 11న అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా, షర్మిల అనంతపురం పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ కార్యకలాపాలను సమీక్షించడం, భావి కార్యాచరణపై చర్చించడం, స్థానిక సమస్యలు మరియు పార్టీ బలపరిచే అంశాలపై దృష్టిసారించనున్నారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమావేశానికి తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM