అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:49 PM

అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సంగా కురిసింది. ఉరవకొండ, విడపనకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. అనూహ్యంగా కురిసిన ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
బూదగవి వంక మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెంచులపాడు – పోలికి మధ్య వాగు ప్రవాహం అత్యధికంగా పెరిగింది. దీంతో రాత్రి నుంచే ఈ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షానికి సంబంధించి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ప్రజలు వాగులు, వంకల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాభావానికి అలవాటు పడిన ఈ ప్రాంతాల్లో ఒకేసారి ఇలా భారీ వర్షం పడటం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM