![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:46 AM
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సాధించిన కప్‌తో ఫొటో దిగేందుకు కర్ణాటక ప్రభుత్వం 11 మంది ప్రాణాలను బలిగొన్నదని జనతాదళ్ (సెక్యులర్) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు జేడీ(ఎస్) తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ చిత్రాన్ని పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఆ చిత్రంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కప్ పట్టుకుని ఉండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జీ. పరమేశ్వర్ సమక్షంలో కొన్ని మృతదేహాలు కనిపిస్తున్నాయి.
తమ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ఆర్‌సీబీ కప్‌ను తామే సాధించినట్లు చిత్రీకరించి ప్రజలను భ్రమింపజేయాలని శివకుమార్ ప్రయత్నించారని జేడీ(ఎస్) ఆరోపించింది. ఈ ఫొటో సెషన్ వెనుక 11 మంది ప్రాణాలు కోల్పోవడం దారుణమని, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీరుపై ప్రజల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు.