![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:02 PM
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి కీలక సమాచారం అందించి సాయపడిన పాకిస్థానీ వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీ పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ అఫ్రీదీని తక్షణమే విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన డిమాండ్‌కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శశి థరూర్ శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Latest News